అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల ఉత్ప త్తిలో భారత్ ఆగ్రస్థానంలో ఉంది . దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల హెక్టార్లకు పైగా రకరకాల సుగంధ ద్రవ్యాలు సాగులో ఉండగా ఏటా 80 లక్షల టన్నులకు పైగా దిగుబడి నమోద వుతోంది . దేశం బహుళ వ్యవసాయిక వాతావ రణ మండళ్లకు నెలవు కావడం వల్ల రైతులు విభిన్న రకాల సుగంధ ద్రవ్యాలను , ఔషధ మూలి కలను సాగు చేయగలుగుతున్నారు .
కొత్త ప్రాంతాలకు విస్తరణ :
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సరి కొత్త లాభదాయక పంటలసాగుకు రైతులు మొగ్గు చూపుతున్నందువల్ల సంప్రదాయకంగా సాగయ్యే ప్రాంతా ల్లోనే గాక సంప్రదాయేతర ప్రాంతా లకు కొత్త పంటలు విస్తరిస్తు న్నాయి . అయితే కొన్ని పంటలు సహ జంగానే సమృద్ధిగా పండే కీలక ప్రాంతాల్లో చీడపీడల బెడద పెనుసవాలుగా మారడం వల్ల పంటల అదనపు సంరక్షణ చర్య లపై అనాసక్తి ధోరణికి దారితీస్తోంది . ఒకప్పుడు గుజరాత్ , రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో విరివిగా సాగయ్యే జీలకర్ర , సోంపు , మెంతులు లాంటి విత్తన రకాలు నేడు తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల వాతావరణంలోనూ సులభంగా సాగుచేయగలిగేలా రూపాంతరం చెందాయి . అలాగే కర్ణాటక , కేరళ రాష్ట్రాల పరిధిలోని పడమటి కనుమలు నల్లమిరియాల సాగుకు పెట్టింది పేరు . కాగా , ఇప్పుడు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ పండుతున్నాయి .
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దులోని గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రధాన పంటగా మారుతోంది . కేరళ , దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్లం విరి విగా సాగువుతుండం నేడు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు . అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా సాగుకు యోగ్యంగా మారింది . ఈ లక్షణాలను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ రైతులు విజయవంతంగా పండించడంతో పాటు పుదీనా నూనె ఉత్పత్తి కూడా ప్రారంభించారు .
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు :
సుగంధ ద్రవ్యాల పంటలతో పాటు వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు , కొనుగోలు కేంద్రాల వలస కూడా మొదలైంది . మొదట్లో గుజరాత్ , మహారాష్ట్ర , తదితర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి , ‘ కేరళ మారుమూల ప్రాంతాల నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారు . ఇది గమనించిన స్థానిక వ్యాపారులు కూడా సుగంధ ద్రవ్యాల రూపాంతరీకరణ , ఉత్పత్తుల తయారీరంగంలోకి దిగారు . ఈ రంగం లో గల అపార అవ కాశాల జాడ పసిగ ట్టిన పారిశ్రామికవే తలు . దేశ వ్యాప్తంగా శుద్ధి , వివిధ ఉత్పత్తుల తయారీ కర్మాగారాలను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు . తొలినాళ్లలో ప్రాధమి కంగా ముడి సుగంధ ద్రవ్యాలతోనే వ్యాపారం నడిచేది . కాబట్టి వాటి శుద్ధి సహా రవాణా కోసం గోతం సంచుల్లో నింపడం వంటి పను లను మానవ శ్రమతోనే చేసేవారు . అయితే సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునే దేశాలు నాణ్యతపరంగా షరతులు విధించడం ప్రారంభించాయి .
దీంతో వ్యాపారులు సాధారణ యంత్రాలను ఏర్పాటుచేసి సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేయడం మొద లు పెట్టారు . తదనంతర కాలంలో అమెరికా , ఐరోపా దేశాలు ప్రాథమిక నాణ్యత పైనే కరిన షరతులు పెట్టాయి . సుగంధ ద్రవ్యాలను అన్నివి ధాలా లోపరహితం చేయాలని , ముఖ్యంగా వాటినుంచి శిలీంద్ర విష కలు షితాలను తొలగించాలని డిమాండ్ చేశాయి . దీంతో వ్యాపారులు వైవిధ్య భరిత పద్ధతులవైపు మళ్లక తప్పలేదు . సుగంధ పార్కుల ర్పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ చూపిన ఫలితంగా 1990 దశకం చివరన సుగంధ ద్రవ్యాల దిగుబడి అనంతర శుద్ధి , ఉత్పత్తుల తయారీలోకి కార్పొరేట్ సంస్థలు ఆడుగు పెట్టాయి . కొత్త శుద్ధి మార్గాలతో పాటు కర్మాగా రాల్లో అత్యాధునిక యాంత్రిక శుద్ధి , ఉత్పత్తి ఉపకరణాలు ఏర్పాటయ్యాయి . ఆప్పటినుంచి సుగంధ ద్రవ్యాలకు విలువ జోడింపు ద్విగుణీకృతమైంది . పొడి , తడి సుగంధ ద్రవ్యాలను వాటి సహజ రూపంలోనే గాక ట్రైన్ ద్రావణంలో నిర్జలీకరణ , పొడి ఘనీభవన , చూర్ణం , నలగొట్టిన , పిండి , గొట్టాల్లో నింపిన రూపాల్లో వివిధ దేశాలకు ఎగుమతి చేశారు .
దేశంలో సుగంధ ద్రవ్యాలు పండే ప్రాంతాలకు సమీపంలో సుగంధ ద్రవ్యాల శుద్ధి , ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా సుగంధద్రవ్య పార్కులు ఏర్పాటయ్యాయి . ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు , తమిళనాడులోని శివగంగ , కేరళలోని పూత్తడి , మధ్యప్రదేశ్ లోని చింద్వారా , గుణ , రాజస్థాన్ లోని జోధ్ పూర్ , కోటలలో పార్కులు ఏర్పడ్డాయి . వీటితోపాటు నాణ్యత నిర్ధారణ కోసం కొచ్చి , గుంటూరు , చెన్నై , ముంబయి , దిల్లీ , కాండా ప్రాంతాల్లో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి . ఎగుమతికి ఉద్దేశించిన సుగంధ ద్రవ్యాల నాణ్యతను రవా జాకు ముందే తనిఖీ చేయడం వీటి బాధ్యత . ఈ చర్యలన్నింటి ఫలితంగా గడిచిన ఐదేళ్ల కాలంలో సుగంధ ద్రవ్యాల ఎగు మతులు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి . తద్వారా రూపాయిపరంగా వార్షిక సగటు వృద్ధి రేటు విలువ 1 శాతంగా , డాలరు పరంగా 5 శాతంగా నమోదు కావడంతో ప్రపంచ సుగంధ ద్రవ్యాల విపణిలో బారత్ పోషిస్తున్న పాత్ర ప్రధానమైంది , తదనుగుణంగా 2017-18లో మొత్తం రూ . 17,929 కోట్ల విలువైన 10.28,060 టన్నుల సుగంధ ద్రవ్యాలు , సంబంధిత ఉత్పత్తులు ఎగు మతయ్యాయి . భారత్ నుంచి మిరియాలు , యాలకులు , మిరప , అల్లం , పసుపు , దనియాలు , జీలకర , మెంతులు , అల్లం , కరివేపాకు పొడి , పుదీనా ఉత్ప త్తులు , సుగంధ నూనెలు వగైరా సుగంధ ద్రవ్యాల ఎగుమతి జరుగుతోంది . 2016 లో 1.05 లక్షల హెక్టార్లలో మిరియాలు సాగై ( నల్ల , తెల్ల మిరియాలు ) , 1.65 లట . ఉత్పత్తి లభించింది . మరోవైపు సింగపూర్ , అమెరికా , నెదర్లాండ్స్ , జర్మనీ , బ్రిటన్ దేశాలు తాము దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తమ అనుకుల భాగస్వామ్య దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తున్నాయి .
విస్తరణ లోపాలు :
పరిశోధనలు , ప్రయోగశాలల ఫలితాలు పొలాలకు విస్తరించడంలో కొన్ని లోపాలున్నాయి . దీంతో పాటు రైతులకు సకాలంలో తగిన సాంకేతిక సల హాలు అందకపోవడం వల్ల వారు సంప్రదాయ పద్ధతులను అనుసరించక తప్పని పరిస్థితులు కొనసాగడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు . ఫలి తంగా చీడపీడల నివారణ కోసం వారు అనుసరించే పద్ధతుల్లోని లోపాలు దిగుబడి , నాణ్యత దిగజా గేందుకు దారితీయవచ్చు . అలాగే రైతుల ప్రమే యంతో నిమిత్తం లేని పంట అనంతర పరిస్థితులు , శుద్ధి , నిల్వ మార్కెట్ స్థాయి కూడా నాణ్యత క్షీణతకు కారణమవుతున్న మరికొన్ని అంశాలు . ఏది ఏమైనా భారత సుగంధ ద్రవ్యాలకు తిరస్కరణ ఎదురుకావడానికి శిలీంద్ర నాశకాలు , సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రధాన కారణాలన్నది స్పష్టమవుతోంది .
అమెరికా ఆహార , ఔషధ నియంత్రణ సంస్థ విడుడల చేసిన నివేదిక ప్రకారం … వారు పరీక్షించిన 20 వేల ఆహార పదార్థాల ఎగుమతులకుగాను దాదాపు 7 శాతంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది . ఇందులో భారత్ నుంచి వెళ్లిన సరుకులో 9 శాతం ఈ బ్యాక్టీరియా ఉనికి ఉన్నట్లు వెల్ల డైంది . సుగంధ ద్రవ్యాలు , మూలికల ఎగుమతులపైనా ఐరోపా సమాఖ్య పంపే తక్షణ హెచ్చరికలను భారత సుగంధ ద్రవ్యాల జోర్డు పర్యవేక్షిస్తోంది . అప్లోటాక్సిన్స్ , పురుగుమందుల అవశేషాలు , సాల్మొనెల్లా ఉనికికి సంబంధించి ఐరోపా సమాఖ్య ప్రధానంగా తక్షణ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది . సమాఖ్య ప్రమాణాల ప్రకారం అప్లోటాక్సిన్ల ఉనికి గరిష్టంగా 10 పీపీబీ ( పార్ట్స్ పర్ బిలియన్ ) ఉండాలి .
అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రమాణాల ప్రకారం ఇది 30 పీపీబీగా ఉంటుంది . కాగా , భారత్ నుంచి ఎగుమతయ్యే కరివే పాకు విషయంలో తగిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల కూడా ఐరోపా సమాఖ్య నుంచి తక్షణ హెచ్చరికలు వస్తున్నాయని సమాచారం . సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే మలేషియా , మెక్సికో , చైనా , ఈజిప్ట్ , ఇండోనేషియా , బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొం టున్నాయి . ఈ నేపద్యంలో సుగంధ ద్రవ్యాలకుగల అంతర్జాతీయ గిరాకీ దృష్ట్యా నాణ్యతను మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆమోదం లభిస్తుంది . తిరస్కరణకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో అత్యధికం సాగుదశలోనివే కాగా , మరికొన్ని శుద్ధికి సంబంధించినవి . కాబట్టి సాగు దశనుంచే పరిశ్రమ వర్గాలు ఈ సమస్యల పై నిశితంగా దృష్టి సారించాలి .

Leave a Reply