Tag: వ్యవసాయ రంగం

  • Mirchi Rate Today : సరికొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. క్వింటాల్ మిర్చి ధర 90 వేలు..

    Mirchi Rate Today : సరికొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. క్వింటాల్ మిర్చి ధర 90 వేలు..

    Mirchi Price Today
    Mirchi Price Today

    సరికొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డు.. దేశీ మిర్చి ధర రూ.90 వేలు.. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మిర్చి మార్కెట్‌కు తీసుకురాగా, మాధవి ట్రేడర్స్ వ్యాపారులు రైతు తెచ్చిన మిర్చిని విక్రయించారు.. లక్ష్మీ సాయి ట్రేడర్స్ వారు  రూ. 90 వేలు రేటు తో కొనుగోలు చేశారు. క్వింటాలుకు రూ.90 వేలు.. అశోక్ తీసుకొచ్చిన ఒక్క మిర్చి బస్తాకే అత్యధిక ధర పలికింది. మిగిలిన బస్తాలకు సాధారణ రేట్లు లభించగా.. మొత్తానికి.. మిర్చి ధర పెరగడంతో రైతులు ఈ సంవత్సరం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు అశోక్ తెచ్చిన మిర్చి కి మంచి ధర రావడం తో రైతు సంతోషం తో బయలుదేరారు.




    జూలైలో వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 32,500.. సెప్టెంబర్ నెలలో అత్యధిక ధర రూ. 35,500లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు దేశీ మిర్చి 90 వేల.. రూపాయలకు చేరుకుని మిర్చి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అకాల వర్షాలు, వైరస్ తెగుళ్లతో ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులు మార్కెట్‌లో మంచి ధర రావడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనన్న భయాందోళనలో ఉన్న రైతులు ఈ రికార్డు ధర కొత్త ఊరటనిస్తోంది. ఇన్ని రోజులుగా మిర్చి అమ్మడం కోసం ఎదురుచూస్తున్న మిర్చి రైతులు మార్కెట్‌కు లైన్ కడుతున్నారు.

  • రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

     ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు బిందు, తుంపర(డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏపీలోని రైతులకు వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. అలాగే, నీటి వృదాను అరికట్టిన వాళ్లం అవుతామని పేర్కొన్నారు.



    రాష్ట్రంలోని కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడదని చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన,

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    డ్రిప్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ మౌలిక వసతుల పై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తక్కువ భూమి ఉన్న దేశాలలో వ్యవసాయంలో పాటిస్తున్న పద్దతులపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.



    రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల అందించేలా చూడాలని, అలాగే వాటిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్‌ అందుబాటులోకి వస్తాయన్న దానిపై సీఎం  ఒక అవగాహన వస్తుందన్నారు.

  • పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

     PM KISAN: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్దిక చేయూత కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 8వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    కేంద్ర ప్రభుత్వం ఈ మద్య కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, అనర్హులు అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.



    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

    • 5 ఎకరాలలోపు గల చిన్న, ఉపాంత రైతులు
    • ప్రతి కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి
    • లబ్ధిదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు?

    • 5 ఎకరాల పైబడిన వారు ఈ పథకానికి అనర్హులు.
    • రాజ్యాంగ పదవిని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తులు.
    • ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు లేదా అధికారులు.
    • స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు.
    • లోక్ సభ, రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
    • రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.



    • జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్.
    • ఏదైనా మునిసిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మరియు మాజీ మేయర్.
    • గత ఏడాది ఆధాయ పన్ను చెల్లించే వ్యక్తులు.
    • ప్రతి నెలా రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • రైతుకు మేలుచేసే పంటలు

    రైతుకు మేలుచేసే పంటలు

    అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల ఉత్ప త్తిలో భారత్ ఆగ్రస్థానంలో ఉంది . దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల హెక్టార్లకు పైగా రకరకాల సుగంధ ద్రవ్యాలు సాగులో ఉండగా ఏటా 80 లక్షల టన్నులకు పైగా దిగుబడి నమోద వుతోంది . దేశం బహుళ వ్యవసాయిక వాతావ రణ మండళ్లకు నెలవు కావడం వల్ల రైతులు విభిన్న రకాల సుగంధ ద్రవ్యాలను , ఔషధ మూలి కలను సాగు చేయగలుగుతున్నారు .



     కొత్త ప్రాంతాలకు విస్తరణ :

     నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సరి కొత్త లాభదాయక పంటలసాగుకు రైతులు మొగ్గు చూపుతున్నందువల్ల సంప్రదాయకంగా సాగయ్యే ప్రాంతా ల్లోనే గాక సంప్రదాయేతర ప్రాంతా లకు కొత్త పంటలు విస్తరిస్తు న్నాయి . అయితే కొన్ని పంటలు సహ జంగానే సమృద్ధిగా పండే కీలక ప్రాంతాల్లో చీడపీడల బెడద పెనుసవాలుగా మారడం వల్ల పంటల అదనపు సంరక్షణ చర్య లపై అనాసక్తి ధోరణికి దారితీస్తోంది . ఒకప్పుడు గుజరాత్ , రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో విరివిగా సాగయ్యే జీలకర్ర , సోంపు , మెంతులు లాంటి విత్తన రకాలు నేడు తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల వాతావరణంలోనూ సులభంగా సాగుచేయగలిగేలా రూపాంతరం చెందాయి . అలాగే కర్ణాటక , కేరళ రాష్ట్రాల పరిధిలోని పడమటి కనుమలు నల్లమిరియాల సాగుకు పెట్టింది పేరు . కాగా , ఇప్పుడు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ పండుతున్నాయి .

     అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దులోని గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రధాన పంటగా మారుతోంది . కేరళ , దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్లం విరి విగా సాగువుతుండం నేడు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు . అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా సాగుకు యోగ్యంగా మారింది . ఈ లక్షణాలను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ రైతులు విజయవంతంగా పండించడంతో పాటు పుదీనా నూనె ఉత్పత్తి కూడా ప్రారంభించారు .



     

    కొనుగోలు కేంద్రాల ఏర్పాటు :

     సుగంధ ద్రవ్యాల పంటలతో పాటు వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు , కొనుగోలు కేంద్రాల వలస కూడా మొదలైంది . మొదట్లో గుజరాత్ , మహారాష్ట్ర , తదితర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి , ‘ కేరళ మారుమూల ప్రాంతాల నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారు . ఇది గమనించిన స్థానిక వ్యాపారులు కూడా సుగంధ ద్రవ్యాల రూపాంతరీకరణ , ఉత్పత్తుల తయారీరంగంలోకి దిగారు . ఈ రంగం లో గల అపార అవ కాశాల జాడ పసిగ ట్టిన పారిశ్రామికవే తలు . దేశ వ్యాప్తంగా శుద్ధి , వివిధ ఉత్పత్తుల తయారీ కర్మాగారాలను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు . తొలినాళ్లలో ప్రాధమి కంగా ముడి సుగంధ ద్రవ్యాలతోనే వ్యాపారం నడిచేది . కాబట్టి వాటి శుద్ధి సహా రవాణా కోసం గోతం సంచుల్లో నింపడం వంటి పను లను మానవ శ్రమతోనే చేసేవారు . అయితే సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునే దేశాలు నాణ్యతపరంగా షరతులు విధించడం ప్రారంభించాయి . 

    దీంతో వ్యాపారులు సాధారణ యంత్రాలను ఏర్పాటుచేసి సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేయడం మొద లు పెట్టారు . తదనంతర కాలంలో అమెరికా , ఐరోపా దేశాలు ప్రాథమిక నాణ్యత పైనే కరిన షరతులు పెట్టాయి . సుగంధ ద్రవ్యాలను అన్నివి ధాలా లోపరహితం చేయాలని , ముఖ్యంగా వాటినుంచి శిలీంద్ర విష కలు షితాలను తొలగించాలని డిమాండ్ చేశాయి . దీంతో వ్యాపారులు వైవిధ్య భరిత పద్ధతులవైపు మళ్లక తప్పలేదు . సుగంధ పార్కుల ర్పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ చూపిన ఫలితంగా 1990 దశకం చివరన సుగంధ ద్రవ్యాల దిగుబడి అనంతర శుద్ధి , ఉత్పత్తుల తయారీలోకి కార్పొరేట్ సంస్థలు ఆడుగు పెట్టాయి . కొత్త శుద్ధి మార్గాలతో పాటు కర్మాగా రాల్లో అత్యాధునిక యాంత్రిక శుద్ధి , ఉత్పత్తి ఉపకరణాలు ఏర్పాటయ్యాయి . ఆప్పటినుంచి సుగంధ ద్రవ్యాలకు విలువ జోడింపు ద్విగుణీకృతమైంది . పొడి , తడి సుగంధ ద్రవ్యాలను వాటి సహజ రూపంలోనే గాక ట్రైన్ ద్రావణంలో నిర్జలీకరణ , పొడి ఘనీభవన , చూర్ణం , నలగొట్టిన , పిండి , గొట్టాల్లో నింపిన రూపాల్లో వివిధ దేశాలకు ఎగుమతి చేశారు . 

    దేశంలో సుగంధ ద్రవ్యాలు పండే ప్రాంతాలకు సమీపంలో సుగంధ ద్రవ్యాల శుద్ధి , ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా సుగంధద్రవ్య పార్కులు ఏర్పాటయ్యాయి . ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు , తమిళనాడులోని శివగంగ , కేరళలోని పూత్తడి , మధ్యప్రదేశ్ లోని చింద్వారా , గుణ , రాజస్థాన్ లోని జోధ్ పూర్ , కోటలలో పార్కులు ఏర్పడ్డాయి . వీటితోపాటు నాణ్యత నిర్ధారణ కోసం కొచ్చి , గుంటూరు , చెన్నై , ముంబయి , దిల్లీ , కాండా ప్రాంతాల్లో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి . ఎగుమతికి ఉద్దేశించిన సుగంధ ద్రవ్యాల నాణ్యతను రవా జాకు ముందే తనిఖీ చేయడం వీటి బాధ్యత . ఈ చర్యలన్నింటి ఫలితంగా గడిచిన ఐదేళ్ల కాలంలో సుగంధ ద్రవ్యాల ఎగు మతులు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి . తద్వారా రూపాయిపరంగా వార్షిక సగటు వృద్ధి రేటు విలువ 1 శాతంగా , డాలరు పరంగా 5 శాతంగా నమోదు కావడంతో ప్రపంచ సుగంధ ద్రవ్యాల విపణిలో బారత్ పోషిస్తున్న పాత్ర ప్రధానమైంది , తదనుగుణంగా 2017-18లో మొత్తం రూ . 17,929 కోట్ల విలువైన 10.28,060 టన్నుల సుగంధ ద్రవ్యాలు , సంబంధిత ఉత్పత్తులు ఎగు మతయ్యాయి . భారత్ నుంచి మిరియాలు , యాలకులు , మిరప , అల్లం , పసుపు , దనియాలు , జీలకర , మెంతులు , అల్లం , కరివేపాకు పొడి , పుదీనా ఉత్ప త్తులు , సుగంధ నూనెలు వగైరా సుగంధ ద్రవ్యాల ఎగుమతి జరుగుతోంది . 2016 లో 1.05 లక్షల హెక్టార్లలో మిరియాలు సాగై ( నల్ల , తెల్ల మిరియాలు ) , 1.65 లట . ఉత్పత్తి లభించింది . మరోవైపు సింగపూర్ , అమెరికా , నెదర్లాండ్స్ , జర్మనీ , బ్రిటన్ దేశాలు తాము దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తమ అనుకుల భాగస్వామ్య దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తున్నాయి .




     

    విస్తరణ లోపాలు :

     పరిశోధనలు , ప్రయోగశాలల ఫలితాలు పొలాలకు విస్తరించడంలో కొన్ని లోపాలున్నాయి . దీంతో పాటు రైతులకు సకాలంలో తగిన సాంకేతిక సల హాలు అందకపోవడం వల్ల వారు సంప్రదాయ పద్ధతులను అనుసరించక తప్పని పరిస్థితులు కొనసాగడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు . ఫలి తంగా చీడపీడల నివారణ కోసం వారు అనుసరించే పద్ధతుల్లోని లోపాలు దిగుబడి , నాణ్యత దిగజా గేందుకు దారితీయవచ్చు . అలాగే రైతుల ప్రమే యంతో నిమిత్తం లేని పంట అనంతర పరిస్థితులు , శుద్ధి , నిల్వ మార్కెట్ స్థాయి కూడా నాణ్యత క్షీణతకు కారణమవుతున్న మరికొన్ని అంశాలు . ఏది ఏమైనా భారత సుగంధ ద్రవ్యాలకు తిరస్కరణ ఎదురుకావడానికి శిలీంద్ర నాశకాలు , సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రధాన కారణాలన్నది స్పష్టమవుతోంది .

     అమెరికా ఆహార , ఔషధ నియంత్రణ సంస్థ విడుడల చేసిన నివేదిక ప్రకారం … వారు పరీక్షించిన 20 వేల ఆహార పదార్థాల ఎగుమతులకుగాను దాదాపు 7 శాతంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది . ఇందులో భారత్ నుంచి వెళ్లిన సరుకులో 9 శాతం ఈ బ్యాక్టీరియా ఉనికి ఉన్నట్లు వెల్ల డైంది . సుగంధ ద్రవ్యాలు , మూలికల ఎగుమతులపైనా ఐరోపా సమాఖ్య పంపే తక్షణ హెచ్చరికలను భారత సుగంధ ద్రవ్యాల జోర్డు పర్యవేక్షిస్తోంది . అప్లోటాక్సిన్స్ , పురుగుమందుల అవశేషాలు , సాల్మొనెల్లా ఉనికికి సంబంధించి ఐరోపా సమాఖ్య ప్రధానంగా తక్షణ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది . సమాఖ్య ప్రమాణాల ప్రకారం అప్లోటాక్సిన్ల ఉనికి గరిష్టంగా 10 పీపీబీ ( పార్ట్స్ పర్ బిలియన్ ) ఉండాలి . 

    అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రమాణాల ప్రకారం ఇది 30 పీపీబీగా ఉంటుంది . కాగా , భారత్ నుంచి ఎగుమతయ్యే కరివే పాకు విషయంలో తగిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల కూడా ఐరోపా సమాఖ్య నుంచి తక్షణ హెచ్చరికలు వస్తున్నాయని సమాచారం . సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే మలేషియా , మెక్సికో , చైనా , ఈజిప్ట్ , ఇండోనేషియా , బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొం టున్నాయి . ఈ నేపద్యంలో సుగంధ ద్రవ్యాలకుగల అంతర్జాతీయ గిరాకీ దృష్ట్యా నాణ్యతను మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆమోదం లభిస్తుంది . తిరస్కరణకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో అత్యధికం సాగుదశలోనివే కాగా , మరికొన్ని శుద్ధికి సంబంధించినవి . కాబట్టి సాగు దశనుంచే పరిశ్రమ వర్గాలు ఈ సమస్యల పై నిశితంగా దృష్టి సారించాలి .