Author: BTVEERANNA

  • జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

    జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

     రోజూ ఉదయం అల్పాహారం తీసు కోవడం ప్రతి ఒక్కరూ చేసే పనే. పాత కాలపు వారు ఉదయం జొన్నరొట్టె, సంకటి తి నేవారు. కాలక్రమేణా పలు రకాలుగా అల్పాహారం తీసు కోవడం అలవాటు చేసుకు న్నారు. అయితే ప్రస్తుతం తీసుకునే వాటిలో పోషకాలు కరువై అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రెగ్యులర్‌గా ఇడ్లి తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇడ్లిలో గ్లూటీన్‌ ఉండడంతో కొందరికి ఇష్టం ఉండదు. అందుకే గ్లూటీన్‌ ఉండని జొన్నతో ఇడ్లి చేసుకొని తింటే బాగుంటుందని జిల్లా కేంద్రానికి చెందిన న్యూట్రిషియన్‌ శాంతకుమారి సూచిస్తున్నారు.

    జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

    దీంట్లో అనేక పోషకాలు ఉంటాయని, ఆరోగ్యం కూడా కాపాడు కోవచ్చని అంటున్నారు. జొన్న ఇడ్లి తయారీ ఎలాగో ఆమె మాటల్లోనే..!

    * తయారీ విధానం..
    జొన్న ఇడ్లి తయారీకి ముందుకు ఒక కప్పు మినప పప్పు, రెండు కప్పుల జొన్నల రవ్వ తీసుకోవాలి. ముందురో జు రాత్రికి 4గంటల ముందు మినప పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. జొన్నలను రవ్వ మాదిరి దంచుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ రెండు మిశ్ర మాలను రాత్రికే నానబెట్టాలి. ఉదయం మామూలు ఇడ్లి మాదిరిగానే వేసుకుంటే జొన్నఇడ్లి సిద్ధమవుతుంది.



    * ఉపయోగాలు..
    పైబర్‌, గ్లూటీన్‌ ఫ్రీ ఉండడం వల్ల ఎముకలకు బలం, కాళ్లకు ఎంతో ఉపయోగకరం. ప్రోటిన్స్‌, పీచు పదార్థం అధికంగా ఉండడంతో ప్యాట్‌ను తగ్గించుకో వచ్చు. ఐరన్‌, క్యాల్షియం, పాస్పరస్‌, మినరల్స్‌ పుష్క లంగా ఉంటాయి. ఎముకలు గుళ్లబా రకుండా పని చేస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. గుండెను పదిలంగా ఉంచుతూ రక్తహీనత లేకుండా చూస్తుంది. ఒక కప్పు జొన్నలో క్యాలరీస్‌-651, కార్బోహైడ్రేట్స్‌- 143 గ్రా., ప్రొటీన్స్‌-21.7గ్రా., ఫైబర్‌-12గ్రా., ఫ్యాట్‌ – 6.3గ్రా., మెగ్నీషియం – 316.8 మి.గ్రా., పాస్పరస్‌ – 551 మి.గ్రా., క్యా ల్షియం – 53.8 మి.గ్రా., ఐరన్‌ – 8.4 మిల్లీ గ్రా ములు ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్‌ రాకుండా అడ్డుకుంటాయి. జొన్న ఇడ్లి రుచిగా ఉంటుంది. ప్రకృతి జీవన విధానానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.

  • రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..?

    రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..?

     మన శరీరానికి శక్తినందించే దుంపల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది కూర చేసుకుని తింటారు. కొందరు జ్యూస్ తాగుతారు. అయితే రోజూ కూరలా చేసుకుని తినలేరు కాబట్టి జ్యూస్ చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే మంచిది. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

    1. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగితే శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

    2. ఎప్పుడూ బద్దకంగా ఉండే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే యాక్టివ్ అవుతారు. దీంతో ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఈ జ్యూస్ మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటారు. అంత త్వరగా అలసిపోరు.

    3. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది. దీంతో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. శిశువు సక్రమంగా ఎదుగుతుంది. ఆరోగ్యంగా పుడుతుంది.

    4. ఎదిగే పిల్లలకు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగించాలి. దీంతో వారికి సంపూర్ణ పోషణ అందుతుంది. బీట్ రూట్‌ లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుల్లో రాణిస్తారు.



    5. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది.

    6. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే ఆ సమస్య పోతుంది. రక్తం పెరుగుతుంది.

    7. లివర్ శుభ్రమవుతుంది. చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. పెదవులు పగలవు. ఎముకలు దృఢంగా మారుతాయి.

    8. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చురుగ్గా ఆలోచించగలుగుతారు.

  • తానికాయతో అనారోగ్య సమస్యలకు చెక్

    తానికాయతో అనారోగ్య సమస్యలకు చెక్

    ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వల్ల అనారోగ్యాలు సంభవిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే మనకు రోగాలు వస్తుంటాయి. అయితే కఫ దోషం వల్ల కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయలు నయం చేస్తాయి. తానికాయల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

    1. తానికాయ చూర్ణం, చక్కెర వేసుకొని ఒక టీస్పూన్ మోతాదులో వేసుకొని రెండింటినీ బాగా గ్లాస్ లో కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని తినాలి. రోజూ ఇలాగే చేస్తే కంటి చూపు బాగా కనిపిస్తుంది.

    2. తానికాయ చూర్ణం ఒక టీస్పూన్ తీసుకుని దానికి కాస్త తేనె కలిపి తింటే గొంతులో నొప్పి, మంట తాగుతుంది. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది. కంఠస్వరం తిరిగి వస్తుంది.

    3. తానికాయ గింజల పప్పును రాత్రి పూట తింటే నిద్ర చక్కగా పడుతుంది.

    4. తానికాయల చూర్ణం 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి రెట్టింపు మోతాదులో తేనె కలిపి సేవించాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

    5. శరీరం మంటగా ఉంటే తానికాయ గింజల పప్పును నూరి శరీరానికి రాసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.



    6. తానికాయల చూర్ణం 3 గ్రాములు, 7 గ్రాముల పాత బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

    7. తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, పాత బెల్లం సమాన మోతాదుల్లో తీసుకుని రోజూ సేవిస్తుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి.

  • కేవలం 17 రూపాయిలతో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం

     దేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల సంఖ్య 40 శాతంపైగా పెరిగినట్లు ఒక నివేదిక పెరిగింది. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనా రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అని. చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహన కంపెనీల బైక్ లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం ధరను కొనుగోలుచేయడానికి ఆలోచిస్తున్నారు.



    చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే ఒక స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కి.మీ వ‌ర‌కు ఆగకుండా ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ పేర్కొంటుంది.

    మరో ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఫుల్ ఛార్జ్ చేయయడానికి అయ్యే ఖర్చు 17 రూపాయలు మాత్రమే అని ప్యూర్ ఈవీ పేర్కొంది. అంటే కేవ‌లం రూ.17తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లలోనే దాదాపు 40 కిమీ స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి 4గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

  • మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే అతికొద్ది వ్యాపారవేత్తల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన 80 ఏళ్ల వయసులో రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్ కు ఆనంద్‌ మహీంద్రా అండగా నిలిచారు. త్వరలోనే ఆమె సొంత ఇంటి కల నెరవేరనున్నట్లు మహీంద్రా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన కమలాతాల్ 2019లో కేవలం 1రూపాయకే ఇడ్లీలు వండి అమ్మడంతో ‘ఇడ్లీ బామ్మ’గా వైరల్ అయింది.



    30 ఏళ్లుగా ఆమె తన వ్యాపారాన్ని కట్టేల పొయ్యి మీద చిన్న ఇంట్లో నుంచే నడుపుతోంది. అయితే, ఆమె లాభాల కోసం కాకుండా రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఆనంద్ మహీంద్రాకు చేరడంతో తనకు అండగా ఉంటానని గతంలో పేర్కొన్నారు. వెంటనే వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరించడంతో పాటు ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా మహేంద్రా పేర్కొన్నారు.

    తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.



    ఈ సందర్భంగా కమలాత్తాళ్‌ వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పిన మహీంద్రారైజ్‌ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం బామ్మకు కావాల్సింది కొత్త ఇంటి స్థలం.. ఆమె పేరున భూమిని రిజిస్టర్‌ చేసి మాకు సాయపడిన తాండమూత్తూర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ బృందం ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాత్తాళ్‌కు ఇప్పటికీ వంటగ్యాస్‌ అందిస్తోన్న భారత్‌గ్యాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

  • రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

     ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు బిందు, తుంపర(డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏపీలోని రైతులకు వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. అలాగే, నీటి వృదాను అరికట్టిన వాళ్లం అవుతామని పేర్కొన్నారు.



    రాష్ట్రంలోని కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడదని చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన,

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    డ్రిప్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ మౌలిక వసతుల పై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తక్కువ భూమి ఉన్న దేశాలలో వ్యవసాయంలో పాటిస్తున్న పద్దతులపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.



    రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల అందించేలా చూడాలని, అలాగే వాటిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్‌ అందుబాటులోకి వస్తాయన్న దానిపై సీఎం  ఒక అవగాహన వస్తుందన్నారు.

  • తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు

    తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు

    తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు

    మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి తగినంత డబ్బులు మీ దగ్గర లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. హోమ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక అని చెప్పుకోవాలి. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా లభించే ఒక గొప్ప అవకాశం.

    ఆర్బీఐ కూడా రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ తక్కువకు లభిస్తున్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు కాబట్టి గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకుంటే మంచిది. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం. వీటితో పాటు ప్రాసెసింగ్ ఫీజు ఆధనం అని గుర్తుంచుకోవాలి.



    కోటక్ మహీంద్రా బ్యాంక్‌: వడ్డీ రేటు: 6.65 నుంచి 7.30 శాతం, ఈఎమ్ఐ: రూ.22,633 నుంచి రూ.23,802, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 2% + జిఎస్ టీ + ఇతర చట్టబద్ధమైన ఫీజులు.

    ఐసీఐసీఐ బ్యాంక్‌: వడ్డీ రేటు: 6.70 నుంచి 8.05% , ఈఎంఐ: రూ.22,722 నుంచి రూ.25,187, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.5 నుంచి 2% లేదా + జిఎస్ టీ.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: వడ్డీ రేటు: 6.70 నుంచి 7.20%, ఈఎమ్ఐ: రూ.22,722 నుంచి రూ.23,620, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 1.50% వరకు లేదా రూ.4,500 + పన్ను.

    బ్యాంక్ ఆఫ్ బరోడా‌: వడ్డీ రేటు: 6.75 నుంచి 8.70% , ఈఎంఐ: రూ.22,990 నుంచి రూ.26,416, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.50 శాతం వరకు (కనీసం రూ.8,500 మరియు గరిష్టంగా రూ.25,000)
    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌: 
    వడ్డీ రేటు: 6.80 నుంచి 8.90%, ఈఎంఐ: రూ.22,900 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజులు: బ్యాంకును సంప్రదించవచ్చు.
    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 
    వడ్డీ రేటు: 6.85 నుంచి 9.05%, ఈఎమ్ఐ: రూ. 22,990 నుంచి రూ. 27,088, ప్రాసెసింగ్ ఫీజు: రుణ మొత్తంలో 0.50 శాతం వరకు (గరిష్టంగా రూ.20,000).
    ఐడీబీఐ బ్యాంక్‌
    : వడ్డీ రేటు: 6.90 నుంచి 9.90%, ఈఎంఐ: రూ.23,079 నుంచి రూ.28,752, ప్రాసెసింగ్ ఫీజులు: రూ.5,000 నుంచి రూ.20,000 + జిఎస్ టి.
    యాక్సిస్ బ్యాంక్: వడ్డీ రేటు: 6.90 నుంచి 8.40%, ఈఎమ్ఐ: రూ.23,079 నుంచి రూ.25,845, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 1%.

    కెనరా బ్యాంక్‌: 6.90 నుంచి 8.90%, ఈఎంఐ: 23,079 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.1,500 మరియు గరిష్టంగా రూ.10,000)

    ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం
    బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు: 6.95 నుంచి 8.85%, ఈఎమ్ఐ: రూ.23,169 నుంచి రూ.26,703.

    గమనిక: ఒక వ్యక్తికి వర్తించే వడ్డీరేటు వయస్సు, లింగం, ఆదాయం, క్రెడిట్ స్కోరు, రుణ మొత్తం, ఆస్తి విలువ, బ్యాంకు/రుణదాత ద్వారా పేర్కొనబడ్డ అనేక ఇతర నియమ నిబంధనలను బట్టి ఉంటుంది.



  • ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

    ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

     

    ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

    దేశంలోని ఓటర్లందరికీ శుభవార్త. భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్(ఈ-ఎపిక్) కార్డును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న మన దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దీనిని ప్రారంభించారు. ఇప్పుడు మీ ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డు అనేది సురక్షితమైన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్(పీడీఎఫ్) వెర్షన్. దీనిలో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.



    మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో పీడీఎఫ్ ఫార్మాట్ లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును మీరు మీ మొబైల్ లేదా డిజి లాకర్‌లో పిడిఎఫ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు లేదా ప్రింట్ తీసుకొని భద్రంగా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఎన్నికల్లో ఓటు కూడా వేయొచ్చు. అంటే ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొదట కొత్త ఓటర్ కార్డు కోసం నవంబర్-డిసెంబర్ 2020 సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగతా సాధారణ ఓటర్లు అందరూ ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును Voter Portal: http://voterportal.eci.gov.in/ లేదా NVSP: https://nvsp.in/ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు కాకుండా సాదారణ ఓటర్లు అందరూ మొదట ఈ-కేవైసి పూర్తి చేసుకోవాలి.



    డిజిటల్ ఓటర్ ఐడి పూర్తి సమాచారం!

    మీకు ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా ఈ-ఎపిక్ కార్డును http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి ఈ-ఎపిక్ డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు. 

    http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి.



    మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి. e-KYC అంటే మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు. ఒకవేల e-KYC ఫెయిల్ అయితే ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే? e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.

  • పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

    పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

     

    పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

    PAN Aadhaar Linking: శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)తో ఆధార్‌ను లింకు చేయడానికి విధించిన గడువును కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది. మార్చి 31 వరకు ఉన్న గడువు తేదీని జూన్‌ 30 దాకా పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ట్విట్టర్ ద్వారా తెలిపింది. రెండో దశ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్ను చెల్లింపు దారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. అలాగే, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌ స్కీమ్‌’ గడువు మార్చి 31తో ముగిసింది.



    గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. గడువు తర్వాత పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్దిక బిల్లు 2021లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది. పాన్ కార్డ్-ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.

  • షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

    షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

     

    షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

    ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 లైట్ సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్చి 29న గ్లోబల్ గా లాంచ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో చైనాలో ఎంఐ 11 సిరీస్ లో మూడు కొత్త ఫోన్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే. షియోమీ ఇంకా భారత్ లో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఎప్పుడు తీసుకొస్తుంది అనేది స్పష్టం చేయలేదు.



    ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు:

    • 6.81-అంగుళాల 2కే ఈ4 అమోఎల్ఈడి డిస్ప్లే
    • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 240 టచ్ శాంపులింగ్ రేటు
    • 1.1-అంగుళాల అమోఎల్ఈడి సెకండరీ టచ్ డిస్ ప్లే
    • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, అడ్రినో 660 జీపీయూ
    • 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 67వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
    • 50 ఎంపీ శామ్ సంగ్ జీఎన్2 ప్రైమరీ వైడ్-యాంగిల్ (f/1.95)
    • 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్586 అల్ట్రా-వైడ్-యాంగిల్(f/2.2)
    • 48 మెగాపిక్సల్ టెలి-మాక్రో కెమెరా (f/2.2)
    • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్/2.2 లెన్స్)
    • 08 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.66,400
    • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.72,000
    • 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.77,500