Tag: Latest News In Telugu

  • Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

    Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

     


    Kajal Aggarwal : టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం జూన్ 19న మగ బిడ్డను జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాజల్ తన కొడుకు పేరు నీల్‌ కిచ్లూ అని నామకరణం చేశారు. ప్రస్తుతం తన విలువైన సమయాన్ని కొడుకు కోసమే గడుపుతున్నారు. తల్లిగా తను పొందే సంతోషాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. కొడుకు పుట్టి ఆరు నెలలు గడుస్తున్నా సందర్భంగా కాజల్ అగర్వాల్ గారు తన కొడుకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాబూ ఫొటోలో తల పైన చేయి పెట్టుకొని చిరునవ్వుతో చాలా ముద్దుగా ఉన్నాడు. బుడ్డోడు




    కాజల్ అగర్వాల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నీల్‌ కిచ్లూ నువ్వు నా జీవితంలో వచ్చి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. నేను యవ్వనంలో ఉన్నప్పుడు. ఒక తల్లిగా న బాధ్యత సరిగ్గా నెరవేరుస్తానో లేదో అన్నా అనుమానం, భయాందోళన నాలో ఉండేది. నేను ఇప్పటికీ గొప్ప తల్లిగా ఎలా ఉండాలో నేర్చుకుంటూనే ఉన్న.




    రాత్రిపూట రోజు నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపైన పాకడం ని అల్లరి చూసి నేను ఎంతో మురిసిపోతూ ఉన్నాను. ర న చిట్టి కన్నా ని జీవితంలో జరిగే స్వీట్ మెమోరీస్ నేను ఎప్పుడు మర్చిపోలేను. రా న చిన్ని తండ్రి
    నేను మీ నాన్న ని జ్ఞాపకాలను, అల్లరి చూసి మాట్లాడుతూ నవ్వుకుంటున్నాం. నీకు జన్మనిచే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువు పుట్టి సంవత్సరం అవడానికి ఇంకా సగం దూరం మాత్రమే ఉంది. మై లవ్ మై బేబీ నీల్’.. అంటూ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
  • ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada
    ChinmayiSriPaada : సినీ పరిశ్రమలో సింగర్ చిన్మయిని తెలియని వారు ఎవరు ఉండరు. ఒక అమ్మాయి కష్టాల్లో ఉందని తెలిస్తే, ఆమె తరపున సహాయం చేయడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారికి పూర్తిగా తెలుసు. కొన్ని రోజుల క్రితం నటుడు, దర్శకుడు రాహుల్‌ గారిని ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని నెలల కిందటే ఇద్దరి కవలలకు జన్మనిచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలిపారు. పోస్ట్ పెట్టినప్పటి నుంచి విమర్శలు ఎక్కువ అయ్యాయి.




    ChinmayiSriPaada Marriage
    మరోవైపు హీరోయిన్ నయనతారలాగే చిన్మయి కూడా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వార్తలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ.. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న తొలి సెల్ఫీ అని తెలిపింది. చిన్మయికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ దానికి సంబంధించిన సమస్యలు మరియు సమస్యలపై అవగాహన కల్పిస్తుంది.




    తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు చిన్నారుల హస్తం కనిపించింది. ఇద్దరి పిల్లలకు ఒకేసారి పాలు ఇవ్వడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫొటోలను అసలు పోస్ట్ చేయరు. కానీ చిన్మయి పోస్ట్ చేసింది. ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • కేవలం 17 రూపాయిలతో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం

     దేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల సంఖ్య 40 శాతంపైగా పెరిగినట్లు ఒక నివేదిక పెరిగింది. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనా రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అని. చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహన కంపెనీల బైక్ లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం ధరను కొనుగోలుచేయడానికి ఆలోచిస్తున్నారు.



    చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే ఒక స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కి.మీ వ‌ర‌కు ఆగకుండా ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ పేర్కొంటుంది.

    మరో ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఫుల్ ఛార్జ్ చేయయడానికి అయ్యే ఖర్చు 17 రూపాయలు మాత్రమే అని ప్యూర్ ఈవీ పేర్కొంది. అంటే కేవ‌లం రూ.17తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లలోనే దాదాపు 40 కిమీ స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి 4గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

  • మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే అతికొద్ది వ్యాపారవేత్తల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన 80 ఏళ్ల వయసులో రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్ కు ఆనంద్‌ మహీంద్రా అండగా నిలిచారు. త్వరలోనే ఆమె సొంత ఇంటి కల నెరవేరనున్నట్లు మహీంద్రా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన కమలాతాల్ 2019లో కేవలం 1రూపాయకే ఇడ్లీలు వండి అమ్మడంతో ‘ఇడ్లీ బామ్మ’గా వైరల్ అయింది.



    30 ఏళ్లుగా ఆమె తన వ్యాపారాన్ని కట్టేల పొయ్యి మీద చిన్న ఇంట్లో నుంచే నడుపుతోంది. అయితే, ఆమె లాభాల కోసం కాకుండా రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఆనంద్ మహీంద్రాకు చేరడంతో తనకు అండగా ఉంటానని గతంలో పేర్కొన్నారు. వెంటనే వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరించడంతో పాటు ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా మహేంద్రా పేర్కొన్నారు.

    తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.



    ఈ సందర్భంగా కమలాత్తాళ్‌ వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పిన మహీంద్రారైజ్‌ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం బామ్మకు కావాల్సింది కొత్త ఇంటి స్థలం.. ఆమె పేరున భూమిని రిజిస్టర్‌ చేసి మాకు సాయపడిన తాండమూత్తూర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ బృందం ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాత్తాళ్‌కు ఇప్పటికీ వంటగ్యాస్‌ అందిస్తోన్న భారత్‌గ్యాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

  • రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

     ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు బిందు, తుంపర(డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏపీలోని రైతులకు వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. అలాగే, నీటి వృదాను అరికట్టిన వాళ్లం అవుతామని పేర్కొన్నారు.



    రాష్ట్రంలోని కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడదని చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన,

    రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

    డ్రిప్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ మౌలిక వసతుల పై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తక్కువ భూమి ఉన్న దేశాలలో వ్యవసాయంలో పాటిస్తున్న పద్దతులపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.



    రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల అందించేలా చూడాలని, అలాగే వాటిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్‌ అందుబాటులోకి వస్తాయన్న దానిపై సీఎం  ఒక అవగాహన వస్తుందన్నారు.

  • పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

    పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

     

    పాన్‌ తో ఆధార్‌ను లింకు కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది

    PAN Aadhaar Linking: శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)తో ఆధార్‌ను లింకు చేయడానికి విధించిన గడువును కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది. మార్చి 31 వరకు ఉన్న గడువు తేదీని జూన్‌ 30 దాకా పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ట్విట్టర్ ద్వారా తెలిపింది. రెండో దశ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్ను చెల్లింపు దారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. అలాగే, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌ స్కీమ్‌’ గడువు మార్చి 31తో ముగిసింది.



    గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. గడువు తర్వాత పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్దిక బిల్లు 2021లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది. పాన్ కార్డ్-ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.

  • పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

     PM KISAN: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్దిక చేయూత కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 8వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    కేంద్ర ప్రభుత్వం ఈ మద్య కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, అనర్హులు అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.



    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

    • 5 ఎకరాలలోపు గల చిన్న, ఉపాంత రైతులు
    • ప్రతి కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి
    • లబ్ధిదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు?

    • 5 ఎకరాల పైబడిన వారు ఈ పథకానికి అనర్హులు.
    • రాజ్యాంగ పదవిని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తులు.
    • ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు లేదా అధికారులు.
    • స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు.
    • లోక్ సభ, రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
    • రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.



    • జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్.
    • ఏదైనా మునిసిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మరియు మాజీ మేయర్.
    • గత ఏడాది ఆధాయ పన్ను చెల్లించే వ్యక్తులు.
    • ప్రతి నెలా రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇటీవలే తన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో మార్చి 18న జరిగింది. అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 ఎంపీ కెమెరా కూడా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    ఇక రియల్‌ మీx7 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసింది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ ఫక్షన్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హూల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులో వస్తున్నాయి. రియల్ మీx7 5జీ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.



    రెండింటిలో ఏది కొనాలి?

    రెండు కూడా నెట్ ఫ్లిక్స్ వంటి వీడియొలు హెచ్ డిలో ప్లే అవుతాయి. దేనిలో డాల్బీ అట్మోస్ లేదు. డిస్ప్లే విషయనకి వస్తే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ కొంచెం మంచిగా ఉంది. ప్రాసెసర్ పరంగా చూస్తే స్నాప్ డ్రాగన్ 732జీ కంటే మీడియాటెక్‌ డైమెన్సిటీ 800 యూ మంచి పనితీరు కనబరుస్తుంది. స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పోల్చిన డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ భాగా పనిచేస్తుంది. మీడియం గ్రాఫిక్స్ లో ఇది భాగా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఉష్ణోగ్రత 47 వరకు వెళ్తే, రియల్ మీx7 5జీలో 43 ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాసెసర్ విషయనికి వస్తే రియల్ మీx7 5జీ మంచిగా ఉంది.

    బ్యాటరీ రివ్యూ:

    ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్ మీx7 5జీ 4310 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జర్(50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ‌నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఎక్కువ కాలం వస్తుంది. నోట్ 10ప్రో మ్యాక్స్ ను ఫుల్ చార్జ్ చేయడానికి గంటన్నర సమయం పడితే, రియల్ మీx7 5జీ నిమిషాల సమయం పడుతుంది.



    కెమెరా రివ్యూ:

    రెండు మొబైల్స్ లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రియల్ మీx7 5జీలో వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో డెప్త్ సెన్సార్ ఉండదు. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కెమెరా ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. రెండింటిలో మెయిన్ కెమెరాతో 30fpsలో 4కే వీడియొ, ఫ్రంట్ కెమెరా 30fpsతో 1080పీ వీడియొ, 120fpsతో 1080పీలో స్లో మోషన్ వీడియొ రికార్డు చేయవచ్చు.

    కెమెరా పనితీరు విషయానికి వస్తే డే లైట్ లో భాగానే పనిచేస్తున్నాయి. నైట్ లైట్ లో కూడా రెండు భాగానే పనిచేస్తున్నాయి. ఫ్లాష్ లో తీసినప్పుడు రియల్ మీx7లో కొంచెం మంచిగా పని చేస్తుంది. వైడ్ యాంగిల్ విషయంలో రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. మాక్రో కెమెరా విషయంలో నోట్ 10ప్రో మ్యాక్స్ భాగా పనిచేసింది. ఫ్రంట్ కెమెరా విషయంలో రియల్ మీx7 కొంచెం మంచి పని తీరు కనబరిచింది.

    రెండింటిలో అన్నీ సెన్సార్లు ఉన్నాయి. అన్నీ భాగానే పనిచేస్తున్నాయి. ఇక రియల్ మీx7 ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే, నోట్ 10ప్రో మ్యాక్స్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటే, రియల్ మీx7లో లేదు. రియల్ మీx7లో మైక్రో ఎస్డీ సపోర్ట్ లేదు, నోట్ 10ప్రో మ్యాక్స్ లో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఎక్కువ కాలం (2 నుంచి 4 సంవత్సరాలు) ఫోన్ వాడాలని అనుకుంటే 5జీ సపోర్ట్ ఉన్న రియల్ మీx7 తీసుకుంటే మంచిది. పెద్ద బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108 ఎంపీ కెమెరా కావాలి అనుకుంటే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

     PM-KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను జమ చేస్తుంది. ఈ పథకంలో భాగంగా మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. 

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ పథకంలో చేరని వారు మార్చి 31లోగా నమోదు పేరును పీఎం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. లేకపోతే ఎనిమిదో విడత నగదు కూడా మీ ఖాతాలో జమకావు. ఇంతక ముందే మీ పేరు నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌(pmkisan.gov.in)లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టులో(అర్హుల జాబితా) పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.




    అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
    • మొదట మీరు Home (pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
    • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
    • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు