బాదంపప్పు ఆరోగ్యానికి (Almond Health Benefits) ఎంతో మంచిది. బాదం పప్పు రోజు తీసుకోవడం వల్ల మనసు చురుగ్గా తయారవుతుందని మన పెద్దలు చెబుతున్నారు.
బాదం పప్పు తింటే శరీరానికి బలం వస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది పెద్దలు పిల్లలు బాదంను ఇష్టంగా తింటారు. రేటు ఎక్కువగా అయినప్పటికీ.. కాస్త తక్కువ మొత్తంలోనైనా వంటలో వేసుకుంటారు. కూరల్లో వేయడంతో పాటు స్వీట్లు కూడా చేసుకుంటారు. కొంతమంది అయితే నేరుగా తినేస్తారు. బాదంపప్పును క్రమం తప్పకుండా రోజు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు మేలుచేస్తుంది. ఐతే చాలా మంది నానబెట్టిన బాదం తినేందుకు ఇష్టపడతారు. రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తీసుకుంటారు. ఐతే ఉదయం ఖాళీ కడుపు తోనే నానబెట్టిన బాదం తింటే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బాదంపప్పు తో ఆరోగ్య ప్రయోజనాలు:
బాదంపప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ఇది పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల మీ ముఖంలో గ్లో పెరుగుతుంది. అందంగా తయారవుతారు.
జీర్ణవ్యవస్థను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడాని కి ఖాళీ కడుపుతో బాదంపప్పును తినవచ్చు. బాదంపప్పును తీసుకోవడం ద్వారా ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా కదలిక శుభ్రపడుతుంది.
బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి మరియు బలం పెరుగుతుంది.బాదంపప్పును శక్తి వనరులు గా కూడా పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలు నీరసాన్ని, అలసటను దూరం చేస్తుంది.
శరీరంలో శక్తి కోసం రోజు క్రమం తప్పకుండా నానబెట్టిన ఐదు బాదంపప్పులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజు తినాలి. బాదంపప్పును నానబెట్టకుండా కూడా తినవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది.
ఖాళీ కడుపుతో బాదంపప్పు ను తినడం వల్ల కలిగే నష్టాలు:
బాదం పప్పును ఖాళీ కడుపుతో రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.
ఖాళీ కడుపుతో బాదంపప్పును రోజు తీసుకోవడం వల్ల ఫుడ్ అలర్జీ వస్తుంది. ఇది ఎవరికీ అర్థం కాదు. దాని వల్లే ఇలా జరుగుతోందని? అని కన్‌ప్యూజ్ అవుతుంది. కానీ నానబెట్టిన బాదం తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుంటుంది. దీని వల్ల వికారం వంటి సమస్య రావచ్చును.
గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో బాదంపప్పు ను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం.
బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బాదంలో ఉండే పీచు పదార్థాలు కారణంగా శరీరంలో గ్యాస్ సమస్యలు వస్తాయన్నారు.
