గులాబీ పువ్వుల గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వాటి అందానికి, సువాసనకు దాసోహం కానివారు ఎవరూ ఉండరు. అయితే కేవలం అందుకు మాత్రమే కాకుండా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ గులాబీ పువ్వులు బాగా పనిచేస్తాయి.
గులాబీ పువ్వుల టీ తయారు చేసే విధానం…
ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుని అందులో కొన్ని గులాబీ పువ్వు రెక్కలను వేయాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో ఆ నీటిలోకి గులాబీ పువ్వు రెక్కల్లో ఉండే ఔషధ పదార్థాలు చేరుతాయి. 20 నిమిషాలపాటు సిమ్మర్‌లో ఉంచి మరిగించాక తయారయ్యే ద్రవంలో కొంత తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవాలి. దీంతో గులాబీ పువ్వుల టీ తయారవుతుంది.
1. గులాబీ పువ్వుల టీని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు పోతాయి. చర్మంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మం శుభ్రంగా మారుతుంది.
2. గులాబీ పువ్వు రెక్కల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. నొప్పులు, వాపులు తగ్గుతాయి.
3. మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, డయేరియా తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
5. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గులాబీ పువ్వుల టీని రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు.
